![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ఆట డాన్స్ షో గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది. ఇక ట్రోఫీని లాంఛ్ చేశారు. దీని కోసం స్పెషల్ గా రాజశేఖర్ - జీవిత జోడీని పిలిచారు. ఈ పెయిర్ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. జడ్జ్ రాధికను చూసి జీవిత చాలా సంతోషపడిపోయారు. ఇక రాజశేఖర్ ఐతే "రాధికా గారు అందరినీ ర్యాగింగ్ చేస్తారు. ఆవిడంటే అందరికీ టెర్రర్ కూడా" అని చెప్పారు. "మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా " అని సుధీర్ అడిగాడు. "చేశారు నేను అద్దం పట్టుకుంటే ఎంతసేపు దువ్వుకుంటావ్ చాలు తియ్ " అని అన్నారు.
ఇక జీవిత కూడా మాట్లాడుతూ "నేను రాధికా గారు శోభన్ బాబు గారు కలిసి ఒక మూవీలో నటించాం. అన్నాచెల్లెళ్లు " అని చెప్పింది. ఇక సుధీర్ ఐతే "మీరు అప్పటినుంచి అలాగే ఉన్నారు నేను ఇప్పుడే ఇలా ఉన్నారేమో అనుకుంటున్నా " అన్నాడు. "ఫస్ట్ పిక్చర్ జీవిత నాతో యాక్ట్ చేసేటప్పుడు కర్ణాటకలోని కెమ్మనగుండి అనే హిల్ స్టేషన్ లో షూటింగ్ జరుగుతోంది. కొంతమంది వచ్చి జీవితతో మిస్ బిహేవ్ చేయడానికి ట్రై చేశారు. దాంతో నేను వాళ్ళను కొట్టాను.
అవును కొట్టాను. అసలు అలా ఎలా ఒక అమ్మాయితో మాట్లాడుతూ మిస్ బిహేవ్ చేస్తారు అని అడిగాను. వాళ్ళు నాతో పోట్లాడారు. వాళ్లంతా విజయకాంత్ ఫాన్స్ అని చెప్పారు. ఐనా సరే నాకు సంబంధం లేదు అని చెప్పాను. అసలు ఒక మహిళతో అలా మిస్ బిహేవ్ చేయకూడదు అని చెప్పాను. ఆ తర్వాత ఆ షూటింగ్ ప్యాకప్ ఐపోయింది. " అని చెప్పింది రాధికా.
![]() |
![]() |